మంత్రి సహకారంతో కాలనీలు అభివృద్ధి

Published: Wednesday June 23, 2021
బాలపూర్, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సహకారంతో ప్రతి కాలనీలో అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికలు చేపడతామని స్థానిక కార్పొరేటర్ రామిడి కవితా రామ్ రెడ్డి అన్నారు. బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ కార్పొరేటర్ రామిడి కవితా రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్లోని ప్రతి కాలనీలలోని సమస్యలను వార్డు కమిటీ ఏర్పాటు చేసి ప్రతి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సెక్రటరీలు స్థానిక ప్రజల సమక్షంలో ప్రతి సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..... కార్పొరేషన్లో ఎక్కడా లేని విధంగా ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి స్థానిక మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ సభ ద్వారా అనేక కార్యక్రమాలను ప్రజల సమక్షంలో తీర్మానం చేయడం జరిగిందిని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ప్రతి కాలనీలో అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికలు చేపట్టడం జరిగిందిని అన్నారు. కాలనీవాసులు అందరికీ కాలని లో ఎలాంటి సమస్యనైనా ఎల్లవేళలా మీ వెంట ఉంటూ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు కమిటీ మెంబర్లు మహిళలు పెద్దలు తదితరులు  పాల్గొన్నారు.