ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday February 01, 2023
*ఓంకారేశ్వర దేవాలయం పేరు రద్దుచేసి  రైతులకు పట్టాలు ఇవ్వాలనీ జాయింట్ కలెక్టర్  తిరుపతయ్య ను కలసి మెమోరండం అందజేశారు* *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం **తెలంగాణ రైతు సంఘం *రంగారెడ్డి జిల్లా కమిటీలు*

మంగళవారం   రోజున యాచారం మండల పరిధిలో  సింగారం రెవెన్యూ పరిదిలో  తాటిపర్తి కురిమిద్ద  నంది వనపర్తి  గ్రామాలల్లో 4 గ్రామాల 600 మంది రైతులు 4 తరాలుగా  సాగు చేస్తున్నా రు రక్షిత కవులు దారి చట్ట ప్రకారంగా  1950 సంవత్సరం లో 37ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అనంతరం 38 ఈ  ఇవ్వాల్సి ఉండగా.  అది ఇవ్వకుండా  1953 సంవత్సరంలో  తప్పుడు పత్రాలు సృష్టించి  ఓంకారేశ్వర దేవాలయం  పేరు రికార్డులో రాశారు,  అప్పటినుండి రైతుల దగ్గర  కౌలు వసూలు చేస్తున్నారు . దేవాలయం పేర  ఈ నాము గాని  రిజిస్ట్రేషన్ లేదు. కాబట్టి ఓంకారేశ్వర దేవాలయం  పేరు రద్దు చేసి  రైతులకు రక్షిత కౌదారు చట్ట ప్రకారంగా పట్టాలు చేయాలనీ   రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్  తిరుపతయ్య కి  మెమో రండం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో  పాల్గొన్నవారు రైతూ సంఘం జిల్లా కార్యదర్శి  బి మధుసూదన్ రెడ్డి  ఉపాధ్యక్షులు కే భాస్కర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి అంజయ్య  ప్రజా సంఘాల జిల్లా నాయకులు  పి యాదయ్య,  బి సామెలు, డి జగదీష్,  ఏ నర్సింహ,  జె రాములు, ఎం సురేష్,  బుగ్గరాములు, బి  మల్లేష్,  యాదయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు,