పెరిగిన ఎసిడి చార్జీలను ఉపసంహరించుకోవాలి. . న్యూడెమోక్రసీ కార్యదర్శి దొండ ప్రభాకర్.

Published: Saturday February 04, 2023

లక్షెట్టిపేట, ఫిబ్రవరి 03, ప్రజాపాలన.

 
పెరిగిన ఎ సి డి చార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏరియా కార్యదర్శి దొండ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు సిపిఐ ఎం.ఎల్ ఆధ్వర్యంలో ఏ సి డి పేరుతో అదనపు విద్యుత్ చార్జీలను వసూలు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు హామీని తుంగలో తొక్కింది అన్నారు. గృహ వినియోగదారులపై సన్న , సిన్న కారు మధ్యతరగతి రైతాంగం పై మోయలేని విద్యుత్ పన్నుల భారాన్ని  మోపుతున్నారన్నారు. ఏసీడీ పేరుతో అడ్వాన్స్ చార్జీలను వసూలు చేయుటకు విద్యుత్ సంస్థకు అధికారాలు జారీ చేయడం కెసిఆర్ ప్రభుత్వ ద్వంద నీతికి నిదర్శనమని అన్నారు. కరెంటు వినియోగదారులపై అధిక భారాలను వేసే ప్రభుత్వ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 24 గంటల ఉచిత కరెంటును నిరంతరాయంగా సరఫరా చేయాలన్నారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలని రకరకాల ముద్దు పేర్లతో విధించే అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలని అన్నారు. లేనియెడల జరగబోయే పరిణామాలకు కెసిఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఎసిడి పేరుతో అడ్వాన్స్ చార్జీలను ఉపసంహరించుకునే అంతవరకు సమరశీల పోరాటాలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, వినియోగదారులు  పాల్గొన్నారు.