దళిత బంధువు కాదు హుజురాబాద్ ఎన్నికల బంధువు జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు కృష్ణారావు

Published: Tuesday July 27, 2021

మధిర, జులై 26, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకు వస్తాయని హుజురాబాద్ ఎన్నికలలో దళితుల ఓట్లు రాబట్టుకునేందుకు ఆ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అమలు చేస్తున్నారని ఖమ్మం జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల మీద ప్రేమ ఉన్నా మరియు వారి అభివృద్ధి కోసం అమలు చేస్తాం అన్నా ఈ పథకాన్ని రాష్ట్ర మంతటా ప్రతి గ్రామంలో ప్రతి దళిత కుటుంబానికి అమలు చేయాలని కుంచం కృష్ణా రావు డిమాండ్ చేశారు. ఒక్క హుజురాబాద్ అయితే ఉప ఎన్నికల కోసమే అన్నట్లుగా చూడాల్సి వస్తుందని మరియు దళితులను మోసం చేయడం అని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన ప్రకారం తక్షణమే దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని మరియు దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిని ఇవ్వాలని అదేవిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించాలని మరియు రాష్ట్రంలో ST, BC మరియు OC లలో ఉన్న అర్హులైన వారందరికీ జనబంధు ఏర్పాటుచేసి మరియు మహిళా బంధు కూడా అమలు చేసి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఖమ్మం జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు డిమాండ్ చేశారు