మధిరలో నిబంధనలకు విరుద్ధంగా మినరల్ వాటర్ ప్లాంట్ లు

Published: Saturday December 11, 2021
మధిర డిసెంబర్ 10వ తేదీ ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో కొన్ని వాటర్ ప్లాంట్ లు అసలు లైసెన్సు లేకుండానే నడిపిస్తున్నారుమధిరలో మినరల్ వాటర్ ప్లాంట్ లు పుట్టకొక్కుల బయటకు వస్తున్నాయిఈ మినరల్ వాటర్ ప్లాంట్లకు లైసెన్సులు ఎలా ఇచ్చారులైసెన్స్లు లోగడ ఉన్నవారు రెన్యువల్ చేసుకోలేదుకనీసంగా రెన్యువల్ చేసుకోకుండానే ప్లాంటు నడుపుతున్న యజమానులుమినరల్ వాటర్ అంటే ఎంతో సురక్షితం అని అనుకుంటే పొరపాటే అంటున్న ప్రజలు మధిరలో చాలామంది వాటర్ ప్లాంట్ లో కనీసంగా బాటిల్స్ ను కూడా శుభ్రత లేకుండానే వాటర్ నింపుతున్న వైనం ఈ మినరల్ క్యాన్లను ఆటోలో నింపుకొని మార్కెట్లోకి తీసుకు వస్తున్న ఆటో డ్రైవర్లకు ఒక్కడుకి కూడా లైసెన్స్ లేకపోవటం ఆటో డ్రైవర్లు ఇష్టం వచ్చినట్టు తోలి కనీసంగా నియమ నిబంధనలు పాటించకుండా పట్టణంలో తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు ఈ ప్లాంట్లపై అజమాయిషీ కరువాయే అంటున్న ప్రజలు నడిరోడ్డు మీద ఆపి వాటర్ పోస్తున్న కూడా పట్టించుకునే నాధుడే లేడు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ వాటర్ ప్లాంట్ మీద స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు