కేంద్ర ఆర్థిక బడ్జెట్ లాగా లేదు, ఇది ఎన్నికల ఎత్తుగడే ఓయూ జెఏసి కన్వీనర్ అనిల్ కుమార్ **

Published: Thursday February 02, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 01, ప్రజాపాలన, ప్రతినిధి : 
 
 
కేంద్ర ఆర్థిక బడ్జెట్ లాగా లేదని, ఇది కేవలం కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ లాగే ఉందని, ఓయూ జేఏసీ కన్వీనర్ అనిల్ కుమార్ కామ్రే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఇది కేవలం కొన్ని రాష్ట్రాల బడ్జెట్ లాగానే ఉందని, జాతీయ బడ్జెట్ లాగా లేదని అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మొత్తానికి ఎన్నికల బడ్జెట్ ను ప్రతిపాదించారని, త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటక కు ప్రత్యేక అదనపు నిధులు కేటాయించారని, ఇది ఎన్నికల ఎత్తుగడే అన్నారు. ద్రవ్యోల్బణాన్ని ఎలా తగ్గిస్తారని, విమర్శించారు.