పీర్జాదిగూడ కార్పొరేషన్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డ

Published: Friday January 20, 2023
మేడిపల్లి, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కంటి సమస్యలను తొలగొస్తూ, అంధత్వ రహిత తెలంగాణ కొరకై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం రెండవ విడత కార్యక్రమాన్ని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ  డివిజన్ మరియు 14వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్లు లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి,పాశం శశిరేఖ బుచ్చి యాదవ్ లతో కలిసి మేయర్ జక్క
వెంకట్ రెడ్డి,డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కమిషనర్ రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ కంటి వెలుగు పథకం ద్వారా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తామన్నారు. ప్రజలందరూ కంటి వెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాష్ నాయక్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, అనంత రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బండారి రవీందర్, పప్పుల అంజిరెడ్డి,లేతాకుల రఘుపతి రెడ్డి తదితరుల పాల్గొన్నారు.