కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

Published: Friday September 09, 2022

మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 08, ప్రజాపాలన: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్    వర్కర్ల సమస్యలు పరిష్కరించలాని ప్రభుత్వ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు  గురువారం రోజున స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో యూనియన్ అధ్యక్షులు చిప్పకుర్తి కుమార్  అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సదర్భంగా   దుంపల రంజిత్ కుమార్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ  ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా పనులు చేస్తున్న  వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని , యూనిఫామ్ ఐడి కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,2లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్తులో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ వర్కర్స్ నరేష్,శంకర్, శిలా, సంధ్య, జ్యోతి, లిఖిత, సునీత, రజిత తదితరులు పాల్గొన్నారు.