పారిశుధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి

Published: Friday September 24, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణములో హనుమాన్ వాడ విద్య నగర్ విజయపురి, మహాలక్ష్మి నగర్ మరియు పోచమ్మ వాడలలో పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి పర్యవేక్షింనారు. రహదారులపై, మురికి కాలువలలో చెత్త చేయవద్దని, వేయడం ద్వారా పందులు, కుక్కల ద్వారా అవి అట్టి పరిసరములను అపరిశుభ్రం చేస్తాయని కావున త్రి బిన్స్ ఏర్పాటు చేసుకొని మున్సిపల్ వాహనమునకు మాత్రమే అందించాలని అవగాహన కల్పించారు. బహిరంగ ప్రదేశములలో చెత్త వేస్తే జరిమానా వేసి చర్యలు తీసుకోనబడునని తెలిపారు. గృహిణి మురికి కాలువలో చెత్త వేయడం గమనించి అలా వేయవద్దని మున్సిపల్ వాహనమునాకు అందించాలని అవగాహన కల్పించారు. అలాగే పట్టణములో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు దేవి శ్రీ గార్డెన్, మహాలక్ష్మి టెంపుల్ మరియు కుర్మా సంఘంలలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకోవలని రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఇంటి ఇంటి కి సర్వే చేస్తూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వీరి వెంట డీ.ఈ రాజేశ్వర్ మరియు సిబ్బంది ఉన్నారు.