డిసెంబర్ 9న చలో ఇంద్రవెల్లి

Published: Friday November 25, 2022

జన్నారం, నవంబర్ 24, ప్రజాపాలన: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా భారీ బహిరంగ సభకు వివిధ ఆదివాసి సంఘాలు తుడుందేబ్బ ఆధ్వర్యంలో డిసెంబర్ 9న చలో ఇంద్రవెల్లి నిర్వహించే ఆదివాసుల అస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రాలను ఆ సంఘ నాయకులు గురువారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. పేసా 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జీవో ఎంఎస్ 3ను యధావిధిగా కొనసాగించాలన్నారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో ప్రభుత్వం 29 శాఖలలో ఉన్న జీవోలను చట్టం చేసి 29 ప్రభుత్వ శాఖలలో 29 ప్రభుత్వ శాఖలలో ఆదివాసి తెగల యువతి యువకులతోనే నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు మర్సుకోల సుశీల భాయ్, జన్నారం తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు రాయసీడం కాళీ, తొడుసం గంగు తుడుం దెబ్బ మండల కోశాధికారి, మండల ఉపాధ్యక్షులు సేడ్రశికి రాజు, సాయికిరణ్, ఆదివాసి సేవా మండల అధ్యక్షుడు దుర్వా యశ్వంత్ రావ్, మండల ఆదివాసి లంబాడి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.