ఆసరా పింఛను ఇప్పించండి : షేక్ బేగం బి

Published: Wednesday November 24, 2021
బోనకల్, నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని అళ్లపాడు గ్రామానికి చెందిన షేక్ బేగంబీ భర్త జిలానీ 58 సంవత్సారాలు నాకు ముగ్గరు కుమారులు పేద్ద కుమారుడు నాగులుమీర పేగు వ్యాధితో 2 సంవత్సరాల క్రితం చనిపోయినాడు 2 వ కుమారుడు జానీ 1సంవత్సర క్రితం కిడ్నీ వ్యాధితో చని పోయినాడు 3వ కుమారుడు మస్తాన్ మదిర లో పాన్ షాప్ తో తన కుటుంబన్ని పోషించు కుంటున్నాడు. నాభర్త జీలానీ 8నేలల క్రితం కేన్సర్ తో మరణించాడు ఇప్పుడు నా పరిస్థితి జీవనం గడపలేక దిక్కు లేని దాన్ని అయినాను. పనికి వేళ్లడానీకి నా వయస్సు సహకరించడం లేదు గతంలో నా భర్త పింఛను తో పోట్టగడుపు కున్నాము. అధికారులు నా పై కనికరం చూపించి ఇప్పుడు నాకు ఆసరా పింఛను ఇప్పీంచి ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఆర్థిక సహాయం సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని మరియు అధికారులను వేడుకుంటూ న్నాను.