కేసిఆర్ కు అభినందనలు

Published: Monday September 13, 2021
మధిర, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : చాకలి ఐలమ్మగా ప్రసిద్దులారాలైన చిట్యాల ఐలమ్మ 1895-1985 జయంతిని 26/09 న వర్ధంతిని 10/09 న ప్రతి సంవత్సరం అధికారాయుతంగా ప్రభుత్వపరంగా జరుపుటకు నిన్న ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారికి అభినందనలు తెలియజేస్తూ నేడు జరిగిన టీడీపీ మధిర నియోజకవర్గ కార్యాలయంలో మధిర టౌన్ టీడీపీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం హర్షం ప్రకటించనైనది చిట్యాల ఐలమ్మ చిత్ర పటానికి మధిర టౌన్ టిడిపీ అనుబంధ బిసి  సెల్ మరియు రజక సంఘ నాయకులు సట్టు వెంకటేశ్వరులు పూలమాలవేసారు హాజరైన మధిర రూరల్ మండల అధ్యక్షులు మారనీడుపుల్లారావు కార్యదర్శి మాదాల నరసింహారావు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి మైనీడి జగన్మోహన్ రావు ఖమ్మం జిల్లా టీడీపీ నాయకులు వంగాల రామకోటి మేడేపల్లి రాణి మండల నాయకులు వేల్పుల కొండ పగిడిపల్లి కాశిరావు  గడ్డం మల్లిఖార్జునరావు గూడెల్లి నాగేశ్వరరావు పాశం రామనాధం వీరవల్లి కోటేశ్వరరావు రజక సంఘం నాయకులు మల్లెల వెంకయ్య పరిగల రమణ జిన్నేపల్లి మురళి గండేపల్లి నరసింహారావు మల్లెలబాబు తదితరులు ఐలమ్మ చిత్రపటానికి పూలు వేసి  ఆమెభారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నిజాం నిరంకుశ పాలనకు జాగీర్దార్ల జమీందార్ల రాజాకార్ల దాస్టీకానికి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో ప్రసిద్ధ పాత్ర నిర్వహించిన దానికి లభించినదే ఈ గుర్తింపు అని ఇది ఐలమ్మ ఘనతే అని జే జే పలికారు పోరాటాలు త్యాగాలు చేసిన సమకాలీన బడుగు బలహీన వర్గ నాయకులను యెల్లకాలం మరవటం ప్రజలను మభ్య పెట్టటం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు అని నిరూపితమైందని రామనాధం మాట్లాడుతూ స్పష్టం చేశారు పేద ప్రజలకు దళితులకు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన, ప్రజలలో మంచి పేరున్న తెలుగుదేశం పార్టీకి మంచి భౌషత్ ఉంటుందని, గుర్తింపు ఉంటుందని ఇలమ్మకు లభించిన ఘన గుర్తింపే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రసంగిస్తూ అన్నారు అలానే తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడి గెలిచిన అనేకమందికి గొప్ప రాజకీయ అవకాశాలు కేసీఆర్ గారికికూడాకల్పించిన దివంగత నందమూరి తారకరామారావు గారి జయంతి, వర్ధంతులను అధికారయుతంగా ప్రభుత్వమే నిర్వహించే విధంగా కేసీఆర్ ఉత్తర్వులు ఇవ్వాలని రామనాధం కోరారు