పాడిపశువులకు బ్రుసెల్లోసిస్ వ్యాధి నివారణకై టీకాలు శంకరపట్నం ఫిబ్రవరి 02 ప్రజాపాలన రిపోర్ట

Published: Friday February 03, 2023

శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో పశువులకు బ్రుసెల్లోసిస్ వ్యాధి నివారణకై  శంకరపట్నం మండల పశు వైద్యురాలు డా. జి భాగ్యలక్ష్మి గురువారం పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్  మాట్లాడుతూ ఈ వ్యాధి సోకిన పశువు గర్భ కోశ వ్యాధికి గురి కావడం వల్ల కట్టు నిలవధని ఒకవేళ కట్టినా పూర్తి గర్భదారణ కాలం గడిచే లోపు గర్భ విచ్చిత్తి (అబార్షన్) అవుతుందని ఆమె తెలిపారు. ఈవ్యాధి సోకిన పశువుల పాలు సంపూర్తిగా వేడి చేయకుండా తాగినా, వ్యాది ఉన్న పశువు ఈనేటప్పుడు వాటి స్రావాలు మనిషి కంటిలో పడిన, చేతులతో తడిమేటప్పుడు చేతులకు గాయాలు ఉన్న గాని పశువుల నుండి ఈ వ్యాధి మనుషులకు కూడా సోకుతుందనీ,ఈ వ్యాధి నివారణ టీకా జీవిత కాలం పనిచేస్తుందని  పాడిరైతులు ఈ టీకాలు ఆడ లేగలు దూడలకు తప్పనిసరిగా వేయించుకోవాలని పశువైద్యాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంజాల రేణుక-రాజయ్య, గోపాల మిత్ర బుద్దారి సంపత్, మంద మొండయ్య, సహాయ సిబ్బంది మౌనిక, పాడి రైతులు తధితరులు పాల్గొన్నారు.