మెడికవర్ హోమ్ హెల్త్ కేర్ వారి.. ఆధునిక వైద్య సేవలు ఇక మీ ఇంటి వద్దకే !!

Published: Thursday March 18, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : వైద్యానికి ఉన్న ఆవశ్యకతను, గృహ వైద్య సేవలకున్న ప్రజాదరణను గుర్తించి మెడికవర్ హోమ్ హెల్త్ కేర్ వారు నూతనంగా ఈ కార్యక్రమానికి నాంది పలికినట్లు వారు తెలిపారు. ఈ సదుపాయం అదనపు వైద్య సేవలు అవసరమయ్యే రోగులకు వరంగా మారనుంది. "హాస్పిటల్ కేవలం 35 % మాత్రమే సంరక్షణ కల్పించగలదు, మిగిలిన 65% రోగి తనాకు తానె సంరక్షణ కల్పించుకోవాలి" అని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇలాంటి అదనపు వైద్య సంరక్షణ అవసరమైన వారికి బాసటగా నిలిచి తక్కువ ఖర్చుతో ఆసుపత్రి స్థాయి వైద్య సంరక్షణను కల్పించడమే ముఖ్య ఉదేశ్యంగా మెడికవర్ సంస్థ ‘హోమ్ హెల్త్ కేర్‘ ను బుధవారం నాడు ప్రారంభించారు. మిగిలిన అన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళ లాగా కేవలం పెద్ద స్థాయి నగరాలకే వైద్య సేవలను పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ స్థాయి నగరాలలో కూడా ఇంటి వద్దకే వచ్చి వైద్య సేవలందించదానికి మెడికవర్ హాస్పిటల్స్ వారు హోమ్ హెల్త్ కేర్ ని ప్రారంభించారు. మెడికవర్ ఆస్పత్రుల అత్యవసర వైద్య విభాగపు డైరెక్టరు, డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం మాట్లాడుతూ రోగి ప్రవేశించడం నుండి డిశ్చార్జ్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన సంరక్షణకు పేరుగాంచిన మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు రోగులకు ఇంటి వద్దనే ఆరోగ్య సంరక్షణ సౌకర్యాన్ని అందిస్తుందని, మెడికవర్ హోమ్ హెల్త్‌కేర్ సేవలు రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత వచ్చే వివిధ వైద్య  అవసరాలను తీర్చే విధంగాను, అవసరం అయినప్పుడు వారితోపాటే ఇంటిలో ఉండడానికి కూడా నిర్చయించుకున్నాం అన్నారు. మెడికవర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ నీరజ్ లాల్ మాట్లాడుతూ “రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత రోగులతో కనెక్ట్ అయ్యే ఏకైక మార్గం హోమ్ హెల్త్‌కేర్, ఇది వారి వైద్య సంరక్షణ కొనసాగింపును మెరుగుపరుస్తుంది. బుక్‌మైషో వంటి మెడికోవర్డ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా, రోగులు అందుబాటులో ఉన్న స్లాట్‌లను సులభంగా ఎంచుకోవచ్చునని అప్పోయింట్ మెంట్స్, హెల్త్ చెకప్స్ ఇతర గృహ ఆరోగ్య సేవలను కొన్ని క్లిక్‌లలో బుక్ చేసుకోవచ్చునన్నారు. చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ మీ ఇంటి వద్దకే - డాక్టర్, నర్స్, ఫీజియోథెరపిస్ట్, చిన్న పాటి శస్త్రచికిత్సలు, శాంపిల్ సేకరణ, అవసరమగు మందుల డెలివరీ వంటి సేవలు హోమ్ హెల్త్ కేర్ లో అందుబాటులో వున్నాయి. మెడికవర్ వద్ద నిష్ణాతులైన వైద్యులు, నర్సులు, ఫీజియో థెరపిస్టులు, అదనపు వైద్య బృందం ఎల్లపుడూ రోగులకు అన్ని రకాల అత్యాధునిక వైద్య సేవలందించడానికి సిద్ధంగా ఉంటుంది దీనితో పాటుగా మెడికవర్డ్ అనే మొబైల్ అప్లికేషన్ ని కూడా ప్రారంభించారు. ఈ మొబైల్ అప్లికేషన్ సహాయంతో అప్పోయింట్ మెంట్ బుక్ చేసుకోవచ్చు, అంబులెన్సు బుక్ చేసుకునే సదుపాయం కూడా కలదు. హోమ్ హెల్త్ కేర్, మందులు, ఆసుపత్రి బిల్లులను చూసుకునే వెసలుబాటు ఉంటుంది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ హెడ్ దుర్గేష్, సెంటర్ హెడ్ మాతప్రసాద్  తరితరులు పాల్గొన్నారు .