వేల కోట్ల కాంట్రాక్టుల కోసం పార్టీలు మరే నీవు, కమ్యూనిస్టుల పై విమర్శలా?

Published: Monday October 10, 2022

 

-రాజగోపాల్ రెడ్డి బహిరంగా క్షమాపణ చెప్పాలి.
 
**సి పి ఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య**
 
చేవెళ్ల అక్టోబర్ 09 (ప్రజా పాలన):                          
 మోడీ  హయాంలో   మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ,కార్మిక చట్టాలను హక్కులను కాలరాస్తు సామాన్య ప్రజల నడివిరిచి   నిత్యవసర వస్తువులపై జిఎస్టి  పేరుతో ఆర్థిక  దోపిడి చేసి   బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు దోచిపెడుతూ   మతోన్మాదాన్ని ప్రేరేపించే బీజేపీ పార్టీలో వేలకోట్ల కాంట్రాక్ట కోసం చేరిన నీవు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటుఅని 
సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు
ఈరోజు చేవెళ్ల మండల కేంద్రంలో బిజెపి నేత  రాజగోపాల్ రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన ఆరోపణలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో  పొత్తులో భాగంగా కమ్యూనిస్టుల అండతో గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి ఈరోజు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు రాజగోపాల్ రెడ్డి 22 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయిన సంగతి ఈ భారత  సమాజానికి తెలుసని ఆయన అన్నారు రేపు జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలలో మతోన్మాద బిజెపి మునిగిపోయే పడవని అన్నారు 100 సంవత్సరాలు చరిత్ర ఉన్న కమ్యూనిస్టులపై మాట్లాడడం తగదన్నారు రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని  కమ్యూనిస్టులకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఏం ప్రబులింగం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వడ్ల సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం సుధాకర్ గౌడ్, ఏఐటియుసి నియోజకవర్గ ఇన్చార్జ్ డి శివయ్య మండల కార్యదర్శి సత్తిరెడ్డి సహాయ కార్యదర్శి ఎం డి మక్బుల్ గీత పని వాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి శివ ఏఐటీయూసీ మండల మహిళా నాయకురాలు మీనాక్షి అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు