ఏజెన్సీ ప్రాంతాలలో గీత పారిశ్రామిక సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి గీత పని వారుల డిమాండ్

Published: Wednesday January 25, 2023

బోనకల్, జనవరి 24 ప్రజా పాలన ప్రతినిధి: ఏజెన్సీ ప్రాంతాలలో గీత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న గీత పనివార్లకు కూడా గీత పారిశ్రామిక సహకార సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలని గీత పని వారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి *బొమ్మగాని నాగభూషణం రాష్ట్ర ఉపాధ్యక్షులు దూసరి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోనకల్లు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన గీత పనివారుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. 1/70 యాక్ట్ అమల్లో ఉన్న ప్రాంతాలలో కూడా గీత పారిశ్రామిక సహకార సంఘాలను ఏర్పాటు చేసి వారిని కూడా ఆదుకోవాలని అన్నారు. ఇప్పటివరకు ఎంతోమంది తాడిచెట్టు, ఈత చెట్ల పైనుండి పడి వికలాంగులు అయి ప్రాణాలు వదిలిన వారు ఎటువంటి సహాయం పొందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మైదాన ప్రాంతంలో కూడా చాలామంది గీత పనివారలు అంగవైకల్యం కలిగినప్పటికీ ప్రభుత్వం నుండి రావలసిన నష్టపరిహారం ఇంతవరకు అందకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా సెంటర్ ను నెలకొలపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు వారు ఈ సందర్భంగా తెలియజేశారు. గీత పారిశ్రామిక సహకార సొసైటీ లకు చెట్లు పెంపకం కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బొమ్మగాని ధర్మ బిక్షం స్థాపించిన గీతపనివార్ల సంఘం 75 సంవత్సరాలుగా గీత పనివారలను సంఘటితం చేసి పోరాడుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే రోజుల్లో గీత పని వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ నిర్వహించటం కోసం ముఖ్యపాత్ర పోషిస్తామన్నారు . కార్యక్రమం అనంతరం గీత పనివారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను వారు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, గీత పనివారల సంఘం రాష్ట్ర నాయకులు కోడూరు వెంకటేశ్వర్లు, తాటిక్రింద కొండయ్య, బంధం నాగేశ్వరావు,ముష్టికుంట సొసైటీ అధ్యక్షులు ధరగాని నాగేశ్వరరావు,డీసీసీ కార్యదర్శి బంధం నాగేశ్వరావు, గీత కార్మిక సంఘం నాయకులు బంధం శ్రీనివాసరావు, గీత పనివారుల సంఘం నాయకులు పరసగాని లక్ష్మణ, సంపేట లోకేష్,బండి కొండయ్య, దుసరి కళ్యాణ్, పెద్ది కౌడన్య గౌడ్, దూసరి గోపాల రావు, తదితరులు పాల్గొన్నారు.