సీఎస్ఆర్, డియంఆఫ్,టీడీఎస్ నిధులు మాకే కావాలి ఎంపీపీ రవీందర్ గౌడ్

Published: Thursday August 05, 2021
జిన్నారం మండల, ఆగస్టు 04, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండల సీఎస్ఆర్, డియంఆఫ్, టీడీఎస్ నిధులు వెంటనే విడుదల చేయాలని జడ్పి సమావేశంలో సభ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీపీ,. జిల్లా పరిషత్ సమావేశంలో జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించి చాలా ఏళ్లు గడుస్తుందని అది ఇప్పుడు శిథిలావస్థకు చేరి వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్ కి కారణమవుతున్నాయని, ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతూ వైద్యానికి వస్తున్నారని, జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ దృష్టికి జడ్పీ వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దయచేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నూతనంగా నిర్మించలని వేడుకున్నారు కలెక్టర్ మరియు జిల్లా చైర్మన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం అతి త్వరలో ఎమ్మెల్యే స్థాయి సమావేశం నిర్మించి సీఎస్ఆర్, డియంఆఫ్, టీడీఎస్ నిధులతో నూతనంగా నిర్మించే ప్రయత్నం చేద్దామని ఆయన తెలిపారు అలాగే జిన్నారం మండలంలోని వావిలాల జంగంపేట చెరువు కట్ట ను తొందరగా మరమ్మతు చేయాలని రెండు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో చెరువు నిండి అలుగు ప్రవాహానికి రెండు గ్రామాల వంతెన తెగిపోయి చాలా ఇబ్బంది పడడం జరిగిందని కానీ సొంత నిధులతో తాత్కాలికంగా నిర్మించడం జరిగిందని, దయచేసి రెండు గ్రామాల చెరువు కట్ట మరమ్మతులు పూర్తి చేయాలని సభ దృష్టికి తీసుకెళ్లరు, దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధించిన అధికారులను ఆదేశించి వెంటనే చర్యలు తీసుకొని పనులు ప్రారంభించాలని తెలిపారు