పేకాట స్థావరం పై దాడి 9 మంది అరెస్ట్

Published: Monday November 01, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 31 ప్రజాపాలన ప్రతినిధి : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో సి పి చంద్రశేఖర్ రెడ్డి, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసి తొమ్మిది మంది పేకాటరాయుళ్ల తో పాటు ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై రూపాయల నగదు 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ ఏ కె మహేందర్ తెలిపారు. ఆదివారం నాడు ఆయన పత్రికల వారితో మాట్లాడుతూ బెల్లంపల్లి హనుమాన్ బస్తీలో రాత్రిపూట రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు ముందే అందిన సమాచారం మేరకు శనివారం రాత్రి పేకాట స్థావరంపై  ఆకస్మి కంగా దాడి చేయగా 9 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 21,150 నగదు 9 మొబైల్ ఫోన్లు,పేక ముక్కలు. స్వాధీనం చేసుకున్నామని తదుపరి విచారణ నిమిత్తం బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులకు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ నిందితుల వివరాలు తెలుపుతూ, ఫయాజ్ హనుమాన్ బస్తి, గడ్నాల అరుణ్ కుమార్, కన్నాల బస్తి, ఎన్. చారి ఎండీ.ఖాసీం బస్తి, ఎలిగేటి శ్యామ్ స్టేషన్ రోడ్ కాలనీ, నాదం కిషన్, హనుమాన్ బస్తి, ఎం.డి యూనస్ హనుమాన్ బస్తి, రాళ్ళబండి శ్రీకాంత్ హనుమాన్ బస్తి, ముత్తే ప్రవీణ్ హనుమాన్ బస్తి, ఎలిగేటి శ్యామ్ కుమార్, రైల్వే కాలనీ, బెల్లంపల్లి. ఉన్నారని అని తెలిపారు. ఈటాస్క్ ఫోర్స్ లో బెల్లంపల్లి 1టౌన్ ఎస్ఐ విఠల్,టాస్క్ ఫోర్స్ పోలీసులు శ్యామ్ సుందర్, శ్రీనివాస్, 1టౌన్ సిబ్బంది సాగర్, గంగారాం, తదితరులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.