అభాగ్యులకు అండగా శేఖర్ పుల్లఖండం

Published: Friday November 26, 2021
మధిర నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : ఆర్యవైశ్య ముద్దుబిడ్డ రోగి కార్చే కన్నీటి బొట్టు సప్త సముద్రoలో నీటికంటే  విలువైనది అని అన్న స్వామి వివేకానంద మాటలు నిజం చేస్తూ పలు పేద కుటుంబాలకు అనారోగ్యం తో బాధపడేవారికీ వికలాంగుల కు పేద విద్యార్థులకు గత 40 సంవత్సరాలనుండి పలు విధాలుగా ఆర్ధికంగా ఎంతో సహాయం చేస్తున్న ప్రముఖ వ్యాపారులు ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, కవి, రచయిత శ్రీ పుల్లఖండం చంద్ర శేఖర్ గారి 60వ పుట్టినరోజు సందర్బంగా 60 మంది నిరుపేదలకు నిత్య అవసర సరుకులు ప్రముఖుల చేతులు మీదుగా అందించినారు  ఈ కార్యక్రమం ముందుగా ఉదయం 7 గంటలకు టీవిఎం హైస్కూల్ లో టీవిఎం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు వేములు విశ్వనాధం ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక సేవకుడు మధిర ఆశ మిత్ర లంకా కొండయ్య గుర్తించిన ఆశ బాధితుల కుటింభికులకు, లెప్రసీ బాధితులకు వితంతు వులు 15 మందికి పెద్దలు మాధవరపు నాగేశ్వరావు, వేముల విశ్వనాధం, కురువెళ్ల కృష్ణా గారు ఉపాధ్యాయులు లింగంపల్లి అప్పారావు ఇతర టీవిఎం వాకర్స్ క్లబ్ సభ్యులు చేతులు మీదగా అందించినారు.అదేవిధంగా పది గంటలకు పుల్లఖండం చంద్ర శేఖర్ గారి ఇంటి వద్ద మధిర సేవా సమితి నిర్వహకులు పల్లపోతు ప్రసాద్ రావు గారి మిత్ర బృందం గుర్తించిన నిరుపేద వృద్దులు వితంతువు లుకు నిత్య అవసర సరుకుల కిట్లు పెద్దల చేతులు మీదుగా పంపిణీ చేసినారు. ప్రముఖ వ్యాపారులు వికాస తరంగిణి నిర్వహకులు శ్రీ కుంచం కృష్ణారావు గారి మిత్ర బృందం ద్వారా శేఖర్ గారి కూటింభికులు మరియు ఆర్య వైశ్య పెద్దల చేతుల మీదగా 15 మందికి సరుకులు కిట్లు అందించినారు. అదే విధంగా శేకర్ గారి షాప్ లో పని చేసే వర్కర్స్ కు ఇంటి పని వారు రజక కూటింభికులు 15 మందికి సరుకులు కిట్లు అంద చేసినారు. అనంతరం శేఖర్ గారికి ప్రతి ఒక్కరు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు.