ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి

Published: Friday April 14, 2023
**ఆంద్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మంత్రి.హరీశ్  రావు విమర్శలు చేయటం
మానుకోవాలివైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర నాయకుడుమాదగోని జంగయ్య గౌౌడ్*

మంచాల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మీడియాలో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఏమి అబివృద్ది జరిగింది అని హేళన చేస్తూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన పై విమర్శలు చేయటం సరైన పద్ధతి కాదు అన్నారు తెలంగాణ రాష్ట్రం లో మేము అన్ని అబివృద్ది పనులు కొనసగిస్తున్నాం రైతులకు24గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం డబల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తున్నాం ఇంకా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని గొప్పలు చెపుతున్న మంత్రి హరిశ్. రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తాం అని ఇప్పట్టి వరకు అమలు చేయలేదు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయలేదు డబల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయలేదు రైతులకు 24గంటలు విద్యుత్ సరఫరా జరగటం లేదు ఇచ్చిన అమిలు అమలు చేయటం మార్చి పోయి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పాలన పై విమర్శలు చేయటం  సిగ్గు చేటు అన్నారు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర మంత్రులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఎప్పుడు కూడా విమర్శలు చేయలేదు అన్నారు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి పాలన అందిస్తూ దేశంలోనే ఇక మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకున్న ఒక డైన మిక్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గార అలాంటి గొప్ప ముఖ్యమంత్రి పరిపాలన పై మంత్రి  హరీశ్ రావు విమర్శలు చేయటం మళ్ళీ ప్రాంతీయ వాదం తెర పైకి తెచ్చి రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన చిచ్చు పెట్టటమే అని అన్నారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రపరిపాలన పై విమర్శలు చేస్తే అది ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని విమర్శించటమే తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. జగన్ అన్న వీర అభిమానులు ఉన్నారు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై విమర్శలు చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ అన్న అభిమానులు చూస్తూ ఊరుకోరు విమర్శకు ప్రతి విమర్శ చేయటానికి తెలంగాణ రాష్ట్రం లో సిద్ధంగా ఉంటారు అని హెచ్చరిస్తున్నాం మళ్ళీ ఏప్పుడు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై  మంత్రి. హరీశ్ రావు  విమర్శలు చేయటం మానుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం