మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్స్ అధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ ద

Published: Friday January 28, 2022
మధిర జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లోతెలంగాణ యువజన కమిటీ అధ్యక్షుడు శివసేనా రెడ్డి పిలుపు మేరకు టీపీసీసీ మరియు సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క ఆదేశాలతో బయ్యారం మండలంకు చెందిన ముత్యాల సాగర్ అనే యువకుడు ఉన్నత విద్యనభ్యసించి ఏడు సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ రావడంలేదని మనస్థాపం చెంది కేసీఆర్ ప్రభుత్వమే కారణమని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులకు న్యాయo చేయాలని, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తుమాటి నవీన్ రెడ్డి మధిర మండల యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ ఆధ్వర్యంలో ధర్నా మరియు కేసీఆర్ ధిష్ఠిబొమ్మను దగ్దం చేయటం జరిగింది ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ టిఎస్పిఎస్సి వద్ద నమోదు చేసుకుని ఉన్నారు అని, వారికి మూడు సంవత్సరాల కాలంగా ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇప్పటివరకు చెల్లించక పోవడం మరియు తెలంగాణ స్టాఫ్ సెలక్షన్ కమిటీ నివేదిక ప్రకారం 1,97,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా భర్తీ చేయడం లేదని తద్వారా ఉద్యోగులు వారి వయోపరిమితి మించిపోవడంతో నిరాశకు లోనై తల్లిదండ్రులకు భారం అవ్వలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అని కెసీస్ నిరుద్యోగులు బలవన్మరణాలకు పురికొలుపుతున్నడని దుయ్యబట్టార  అద్దంకి రవికుమార్ మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కెసిఆర్ మాత్రం తన ఇంట్లోఏ ఒక్కరు ఖాళీగా ఉండకూడదు అని 5 నియామకాలు చేపట్టుకున్నరని, కానీ విద్యార్థులు తమ జీవితాలను, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రావడానికి శ్రీకారం చుడితే వారిని మాత్రం గాలికి వదిలేసి వారి చావులకు కారణమవుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఇకపైన బలవన్మరణానికి పాల్పడవద్దు అని ఈ  విషయాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గారి దృష్టికి పీసీసీ అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెల్లే విధంగా మరియు నిరుద్యోగుల పక్షాననియోజకవర్గ యూత్ కాంగ్రెస్ తరఫున మృతుని కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్గ్రేషియా, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ మధిర మండల యూత్ కాంగ్రెస్ కమిటి అద్వర్యంలో ఈ రోజు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేసే కార్యక్రమం తలపెట్టటo జరిగినది త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్ వేయకపోతే యూత్ కాంగ్రెస్ అద్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టి మీకు తగిన బుద్ధి చెపుతామని అన్నార ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్స్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ టౌన్ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు కౌన్సిలర్ కోన ధనికుమార్ కిసాన్ సెల్ అధ్యక్షులు దుంపా వెంకటేశ్వర్ రెడ్డి ఎస్సీ సెల్ మండలధ్యక్షులు దా రా బాలరాజు మండల సేవాదళ్ అధ్యక్షులు ఆదూరి శ్రీనివాస్ టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే జాంగిర్ టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల లాలయ్య సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్ పత్తేపురం సంగయ్య మాగం ప్రసాద్ భూక్యా రమణ మోదుగు బాబు ఆదిమూలం శ్రీనివాస్ మైలవరపు చక్రి యూత్ కాంగ్రెస్ నాయకులు నెల్లూరు విజయ్ వారం వెంకట్ కత్తి పుల్లారావు భూక్య శ్రీకాంత్ మంద వంశీ సంప శాల గోపి బాలాజీ చింత మాల గోపాల్ రావు పృథ్వి సిద్దు ఉదయ్ కార్తీక్ రవితేజ, సాయి తదితరులు తదితరులు పాల్గొన్నారు.