ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు ముగ్గురు మాటూరు

Published: Friday March 10, 2023

 హైస్కూల్ విద్యార్థులు ఎంపిక మధిర రూరల్ మార్చ్ 9 ప్రజాపాలన ప్రతినిధి మదిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు తాత్కాలికంగా ప్రకటించినఎన్ఎంఎంఎస్ ఫలితాలలో ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయి కృష్ణమాచార్యులుతెలిపారు.

 మాటూర్ హైస్కూల్ నందు 8వ తరగతి చదువుచున్న *మేడిశెట్టి మహాలక్ష్మి, దోనెపూడి కావ్య, శ్రీరాముల ఉపేంద్ర లుఎన్ఎంఎంఎ ఎస్ ఉపకార వేతనాలకు ఎంపిక అయ్యారని, తుది ఫలితాలలో కూడా ఎంపిక ఐతే వీరికి సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనాలుగా అందుతాయని తెలియజేస్తూ, వచ్చే నవంబర్లో కూడా పరీక్షలు హాజరు కాబోయే విద్యార్థులు వీరి స్ఫూర్తితో చక్కగా రాణించాలని కోరారు. ఎన్ఎంఎంఎస్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సెలెక్ట్ అయ్యేలా కృషిచేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాం, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, బాణోత్ బావ్ సింగ్, వేము రాములు, గుంటుపల్లి రమాదేవి,పి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.