తెలంగాణలోని ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరు పెట్టాలి

Published: Thursday June 24, 2021
- తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పండ్ర ప్రగడ లక్ష్మణ్ రావు
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లాకు మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు (పి వి నరసింహారావు) పేరు పెట్టాలని సీఎం కేసిఆర్ ను తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పండ్ర ప్రగడ లక్ష్మణ్ రావు కోరారు. పి వి నరసింహారావు విగ్రహం వద్ద తెలంగాణ బ్రహ్మన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణా రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, బహు భాషా కోవిదుడు పి వి నరసింహారావు పేరు మీద ఈ నెల 28 వ తేదీ లోగా ఒక జిల్లాను ప్రకటించాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణా రావు మాట్లాడుతూ ఇప్పటికే అలకాపురి ప్రధాన రహదారిలో ఉన్న పి వి నరసింహారావు విగ్రహానికి రేలింగ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రతి బ్రాహ్మణుడు ఇలా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు ఇప్పటికీ పి వి శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి రంగారావు, మంత్రి సునీల్ పాల్గొన్నారు