24న కెవిపిఎస్ ద్వితీయ మహాసభలు జయప్రదం చేయండి కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ కమా

Published: Friday July 22, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై21(ప్రజాపాలన ప్రతినిధి) : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) కేబీ జిల్లాలో ద్వితీయ మహాసభలు ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో జరుగనున్నట్లు కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ తెలిపారు. గురువారం వాంకిడి మండలంలోని కమాన గ్రామములో జిల్లా మహాసభల కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 150 మంది ప్రతినిధులతో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమం అభివృద్ధికి  అనేక పథకాలకు వాగ్దానాలు చేసి నీటికి ఒకటి కూడా అమలు చేయడం లేదని అన్నారు. కేంద్ర మనువాద ప్రభుత్వం భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతుందని అన్నారు, విద్య ఉపాధి వైద్యం కొరకై మహాసభల్లో చర్చించి ఆందోళనా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు తేమాజీ, తిరుపతి, శేఖర్, యశ్వంత్ రావు, జయంత్ రావు, మనోహర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.