లేనిన్ నగర్ ప్రాంతాలను పర్యవేక్షించిన మంత్రి

Published: Wednesday June 02, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : నిన్న కొద్దిపాటి కురిసినట్టువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ అతలాకుతలం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడ ఉన్న ట్రంక్ లైన్ పనులు తొందరగా పూర్తి కావాలని అధికారులకు ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ ప్రశాంతి నగర్ లో ప్రజలు ఎంతో ఇబ్బంది పడడంతో ఆ విషయం  స్థానిక శాసన సభ్యురాలు  విద్యశాఖ మంత్రిసబితా ఇంద్రా రెడ్డి కు తెలియజేశారు. వెంటనే ఆమె సోమవారం నాడు ఉదయం ప్రశాంతి నగర్ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించడ,  సమస్యను గుర్తించి వెంటనే అక్కడ టర్నూల్ ఏర్పాటుకు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి అలాగే సిద్ధల లావణ్య బీరప్ప, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, వేముల నరసింహ్మ, సిద్ధాల బీరప్ప. జ్యోతి కిషోర్, ఇంద్రావత్ రవి నాయక్. ధనలక్ష్మి రాజకుమార్. ప్రమీల యాదగిరి. రాజు విజయలక్ష్మి .అరుణ ప్రభాకర్ రెడ్డి. ముద్ద పవన్ కుమార్. అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్, మా దారి రమేష్, అలాగే మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, డీ ఇ సత్యనారాయణ, ఏ ఇ కృష్ణయ్య, స్థానిక కార్పొరేటర్ సౌందర్య విజయ్, టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు యువకులు మహిళామణులు తదితరులు పాల్గొన్నారు.