బ్రతుకు జీవుడాని వస్తే బ్రతుకే మాయం

Published: Friday May 28, 2021

కార్మికుల జీవితాలను అల్లకల్లోలం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కార్మికుల ప్రాణాలుతీస్తూ వారికుటుంబ సభ్యులకు ఏ అదేరువు లేకండ ఏకాకులుగా నడిరోడ్డుపై పడేస్తున్నారు, సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిన్నారం మండలం పారిశ్రామికలో జరుగుతున్న తతంగాలపై ప్రత్యేక కథనం


ఉమ్మడి జిన్నారం మండలం ఐడీఏబొల్లారం, కాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, గుమ్మడిదల ప్రాంతాలలో వందల పరిశ్రమలు నెలకొన్నాయి, ఇక్కడికి బ్రతుకుదేరువు కోసం పొట్టచేతుల పట్టుకొని తెలుగు రాష్ట్రాలు ఆంద్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల నుండే కాకుండా భారతదేశం నలుమూలల నుండి జీవనోపాధి కోసం ఈ ప్రాంతానికి వలసలు వస్తుంటారు, ఇక్కడికి వలసలు రావడం తిరిగి శవంగా పోవడం జరుగుతుంది,పలు పరిశ్రమల్లో ఎలాంటి సేఫ్టీలు వహించిక పోవడంతో పాటు విచ్చలవిడిగా కాలుష్యం వేదజల్లుతూ నిత్యం ఎదో ఒక్క పరిశ్రమలో రియాక్టర్లు పేళుతూ, అగ్నిప్రమాదలు సంభవిస్థూ, విద్యుత్ షాకుతో, భయంకరమైన రసాయనాలు వంటిపైన పడడంతో ప్రతినిత్యం ఏదో ఒకవిధంగా వందలమంది కార్మికుల ప్రాణాలను పొట్టన పేట్టుకుంటున్న పరిశ్రమ యాజమాన్యాలు,పరిశ్రమల్లో కార్మికులు చనిపోవడం సాధ్యమైనంత వరకు గోప్యంగా వ్యవరిస్తున్నారు, ఒక్కవేళ్ళ బయటకు వస్తే సంబంధిత అధికారులు రావడం మామ్ముళ్ళు తీసుకోవడం పరిశ్రమపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడి ఆనవాయితి, చనిపోయిన కార్మిక కుటుంబాలకు దహన సంస్కారాలకు ఐదో, పదో వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు, అడిగేవారు లేక యాజమాన్యాలకు ఆడిందేఆట పాడిందేపాట అన్నట్టుగా మారింది వ్యవహారం,ఇంత తతంగం జరుగుతున్న ఇన్నీ దారుణాలు జరుగుతున్న సంబంధిత అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంకోసం ఫోనుచేస్తే లేపకపోవడం, వాళ్ళ వ్యవహారశైలి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది, పరిశ్రమ యాజమాన్యాలు ఇచ్చే మమ్ముళ్లకు అలవాటు పడి పరిశ్రమలకు వత్తాసు పలుకుతున్నారని స్థానికుల నుండి గట్టిగానే వినిపిస్తోంది, చివరికి కార్మికులు స్థానికులు అధికారులపైన ఆశలే వదులుకున్నారు, ఇప్పటికైనా అధికారులు తమవిధిని సక్రమంగా నిర్వహించి, ఘటన జరిగిన పరిశ్రలపై నాన్చకుండ సరియైన సమయంలో చట్టరీత్య చర్యలు తీసుకుంటే, కార్మికులకు భరోసా కలిగించడమే కాకుండ, వారి కుటుంబసభ్యుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవారు అవుతారు, అంతే కాకుండ నిత్యం పరిశ్రమల్లో జరుగుతున్న ఘటనలను ఎంతోకొంత అరికట్టిన వాళ్ళు అవుతారని స్థానికులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు,