బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి

Published: Monday September 26, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి):  పట్టణ రాయల్ ఫంక్షన్ హాల్ లో 26, 27 వార్డుల అడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైన 1456 బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ పంపిణీ చేసినారు. అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంది అన్నారు. ఆరోగ్య శ్రీ నిర్వీర్యం అని కొందరు నాయకులు చెప్పడం విడ్డూరం గా ఉంది అన్నారు. గతంలో సీఎం సహాయ నిధి నిధుల్లో తెలంగాణ కి మొండి చెయ్యి చూపించినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 25 లక్షల మందికి ఆరోగ్య సేవలు అందించడం జరిగింది అన్నారు. గతంలో కంటే ఎక్కువ రోగాలను వైద్య సేవలు ఆరోగ్య శ్రీ లో చేర్చడం జరిగింది అన్నారు. అన్ని కులాల మతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్య, వైద్యం, వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో
కౌన్సిలర్ లు రజీయుద్దిన్, అస్మ అంజుం షకీల్, నాయకులు సమిండ్లశ్రీనివాస్, జిలానీ, బాసిత్, అక్మల్, యాకూబ్, గౌస్, రహమాన్, డీ ఈ రాజేశ్వర్, మెప్మ, ఎఓ శ్రీనివాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 
 
 
Attachments area