అర్ఎంపి లను కించపరిచే లా ఉన్న పాటలో మార్పులు చేయాలి

Published: Tuesday January 11, 2022
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.మొండయ్య, బి.శ్రీనివాస్
దండేపల్లి, జనవరి 10, ప్రజాపాలన : చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో "యడయాడ నెమరచు అని కుర్రాలంతా ఆర్ఎంపీలవుతున్నారు అంటూ అర్ఎంపీ లను కించపరిచేలా ఉన్న పాటలో మార్పులు చేయాలని జిల్లా ఆర్ఎంపి, పియంపిల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.మొండయ్య, బి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం దండెపెళ్లి మండల శాఖ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎంపి, పియంపీ లను కించపరిచేలా, అవమానపరిచేలా ఉన్న ప్రతి చర్యను ముక్తకంఠంతో ఖండించాలని చూసించారు. ఆర్ ఎంపీలు, పియంపీలు గ్రామీణ వైద్యులు అని, ప్రజల మన్ననలు పొందు తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా మండలాధ్యక్షులు కోప్పల లక్ష్మన్ మాట్లాడుతూ ఈ సినిమాలో మమ్మల్ని కించపరిచే విదంగా వాడిన పదజాలన్ని వెంటనే తొలగించకుంటే తీయటర్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి ఒరగంటి సత్యనారాయణ, ట్రెజరర్ మునేశ్, వైస్ ప్రసిడెంట్ రాజు, జిల్లా ఇసి మెంబర్ సందినేని నర్సయ్య, అర్ఎంపిలు  రవీందర్, సత్తయ్య, రాజేందర్, సాగర్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.