లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

Published: Tuesday March 16, 2021

ప్రజాపాలన - క్యాతన్పల్లి, 15 మార్చి : పురపాలక సంఘం రామకృష్ణాపూర్ పట్టణం రాజీవ్ చౌక్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ చేతులమీదుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం క్లబ్ సభ్యులు ఆదివారం మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రి వైద్యులు రాజా రమేష్ సోదరి గుడిసెల సురేఖ, మేకల రాజయ్య తండ్రి మేకల లింగయ్య జ్ఞాపకార్థం ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వేసవి కాలంలో ప్రయాణికులు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి వైద్యులు రాజా రమేష్, కౌన్సిలర్ రామిడి ఉమదేవి, మేకల రాజయ్య, క్లబ్ కోఆర్డినేటర్ ఆడెపు కృష్ణ కుమార్, కంబగోని సుదర్శన్ గౌడ్, మంద వేణుగోపాల్, ఆత్మకూరి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.