*దళిత జర్నలిస్టులకు దళిత బంధు, ఇండ్లు ఇవ్వాలి*

Published: Wednesday April 12, 2023
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 11, ప్రజాపాలన: దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం ప్రత్యేకంగా అమలు చేయాలని ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో వివిధ పత్రికలు, టీవీ ఛానల్ లో  పనిచేస్తున్న జర్నలిస్టుల తరుపున తెలంగాణ ఎస్ సి ఎస్ టి జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జర్నలిస్టులు గా ఏళ్ల తరబడి పనిచేస్తూ ఎటువంటి ఆర్థిక స్తోమత లేక ఉపాధి అవకాశాలు లేక పత్రికల్లో పని చేస్తూ కాలం వెళ్ళదిస్తున్నరని  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ తమ వార్తల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం పని చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం అమలు చేస్తుంది ఈ పథకం దళిత జర్నలిస్టులకు కూడా   వర్తింపజేసి ప్రత్యేకంగా అమలు చేయాలని జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలలో పనిచేస్తున్న వారికి ఇంటి స్థలాలు లేక ఇండ్లు లేక అద్దె భవనాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే వారిని గుర్తించి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
జిల్లా అధ్యక్షులు ఒరగంటి సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల శ్రీధర్, జిల్లా కోశాధికారి కొండ శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులేటి రవి సంతోష్ రాజు తదితరులు పాల్గొన్నారు.