అంగన్వాడీ కేంద్రల్లో యోగ డే కార్యక్రమాలు

Published: Wednesday June 23, 2021
బీరుపూర్, జూన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో యోగ డే ను పురస్కరించుకుని బీరుపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో యోగ కారేక్రమాలు నిర్వహించి యోగ వలన కలిగే ప్రయోజనాలు అవగాహన తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచు ఘర్షకుర్తి శిల్పరమేష్ అంగన్వాడీ సూపర్వైజర్ కుసుమ అంగన్వాడీలు విజయ వసంత సోని మహిళలు కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.