19న నారీ సమ్మాన్ అవార్డులు ప్రధానం చేయనున్న హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్.

Published: Tuesday March 15, 2022
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగా సంఘాన్ని శక్తివంతం చేయగల అంకితభావం ఉన్న మహిళలకు హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు మార్చ్ 19న బషీర్ బాగ్ లోని భారతీయ విద్యాభవన్ లో నారీ సమ్మాన్ అవార్డు తో సన్మానిస్తామని తెలిపారు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రౌత్. ఈ అవార్డు కు 201 మంది మహిళలను ఎంపిక చేశామని, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఖైరతాబాద్ ఎం ఎల్ ఏ దానం నాగేందర్, ప్రముఖ శాస్త్రవేత్త మధు క్రిషన్, భేటి బచావో బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ ప్రశాంత్ గైక్వాడ్ తదితరులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి ఆకాంక్ష షా, మాజీ మిస్ ఆసియా రష్మీ ఠాకూర్, హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్. ప్రతినిధులు డాక్టర్ పి ఎస్ సాగర్, డాక్టర్ సుభాని షేక్, వసుధా రాణి, శ్రావణి రౌత్, వంశీ కృష్ణ, సుధా జైన్ తదితరులు పాల్గొన్నారు.