విద్యార్థులకు పుస్తకాలు అందజేత

Published: Friday February 19, 2021
మధిర, ఫిబ్రవరి 18, ప్రజాపాలన: గురువారం రోజున ప్రాథమిక పాఠశాల బనిగండ్లపాడు(BC) కాలనీ నందు కరోనా కాలంలో విద్యార్థినీ విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని వారు అలా దూరం అవ్వకుండా ఆన్లైన్ క్లాసులు వింటూ వాటిని సమగ్రంగా విద్యార్థులకు చేరువయ్యేలా చెయ్యటానికి విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగా గురునాథ  రెడ్డి మరియు వారి సోదరి మణి టిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి గారి ఆర్థిక సహాయంతో 14000 రూపాయలతో వర్క్ షీట్ లు, spiral binding పుస్తకాలను, కాపీరైట్స్ పుస్తకాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ జంగా పుల్లా రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు కోవిడ్ కారణంగా విద్యకు దూరం అవ్వకుండా ఉండేందుకు సహకరిస్తున్న దాతలకు మరియు పాఠశాల సిబ్బంది కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి జంగా పుల్లారెడ్డి గారు, టిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు శీలం  ఉమా మహేశ్వరి గారు, పెద్ద గోపవరం సొసైటీ చైర్మన్ శీలం అక్కిరెడ్డి గారు, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ వేమిరెడ్డి పాపి రెడ్డి గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారు వెంకట్ రావు గారు, అంగన్వాడీ టీచర్ మేరీ కాంతం, ఉపాధ్యాయులు గోలి, చిన్నప్ప, లక్ష్మీ, సుకన్య పాల్గొన్నారు.