భావి భారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : ఉపాధ్యాయ ఎం.ఎల్.సి. అభ్యర్థి ప్రొఫెసర్ నతానియేల

Published: Monday March 06, 2023
భావి భారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అన్నారు మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాదు నియోజకవర్గ ఉపాధ్యాయ ఎం.ఎల్.సి. గా పోటీ చేస్తున్న  ప్రొఫెసర్ నతానియేలు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను స్కూల్ అసిస్టెంట్ గా కెరియర్ ప్రారంభించి,ఎం.ఇ.ఓ గా గెజిటెడ్ హెడ్మాస్టర్ గా ,2009 నుండి నేటివరకు ఓ.యు. లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులందరిని విజ్ఞప్తి చేశారు.ఉపాధ్యాయ రంగాన్ని నేటి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వకపోగా, విద్యారంగానికి ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్నాయన్నారు . విద్యా రంగంలో సమస్యలు ఇప్పటికి అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు సరిగా లేవని, సరిపడ బోధన సిబ్బంది లేరని,ఉన్న ఖాళీలను నేటికి భర్తీ చేయలేదన్నారు.అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకపోవడం, కె.జి.బి.వి. సంక్షేమ,
ఆశ్రమ పాఠాశాలలలో ఉపాధ్యాయలు క్రమబద్ధీకరణ, జూనియర్, డిగ్రీ కళాశాలలో బోధన సిబ్బంది నియామకాలు, సి.పి.ఎస్. రద్దు, 2016, 2020 పి.ఆర్.సి. ఏరియర్స్
చెల్లింపు సమస్యలు కానందున ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీవ్ర నిరుత్సాహంతో
ఉన్నారు.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తనకు ఓటు వేసి గెలిపించాలని నతానియేలు విజ్ఞప్తి చేశారు.