*బెల్లంపల్లిలో ఆర్ పి అరాచకం* __నిరుపేద కుటుంబం భూమి ఆక్రమణ __అధికారులంతా నా వాళ్ళే అంటూ దౌర్జ

Published: Thursday March 30, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 29, ప్రజాపాలన :
 
నిరుపేదల పట్ల పలుకుబడి గల రాజకీయ నాయకులు, డబ్బు గల ధనవంతులు దౌర్జన్యాలు చేస్తుండడం మనకు ఆక్కడక్కడ కనిపిస్తుంది ,కానీ బెల్లంపల్లి లోని  టు ఇంక్లైన్, ఆరవ వార్డు కు చెందిన మహిళా గ్రూపులకు సంబంధించిన ఆర్ పి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించుకుని భారీ భవన నిర్మాణాన్ని చేపడుతుందని, దీంతో బాధితులు లబోదిబోమంటూ వారి గోడును ఫిర్యాదు రూపంలో అందజేశారు. వివరాల్లోకెళ్తే  టు ఇంక్లైన్ బస్తికి చెందిన ఎర్ర పోసక్క అనే నిరుపేద మహిళ 1989వ సంవత్సరం నుండి తన స్థలంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారని. ఇదే అదనుగా భావించిన మహిళా గ్రూపుల ఆర్.పి సల్ల రజిత తన ఇంటి పక్కనే గల నిరుపేద కుటుంబం వారు ఇంట్లో లేని సమయంలో చాటుమాటుగా తన అక్రమ నిర్మాణానికి పూనుకున్నారు. సహజంగానైతే తహసిల్దార్ కార్యాలయం నుండి ఎన్ ఒ సి  నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొని మున్సిపల్ అధికారులను సంప్రదించి అనుమతి పొందాలి అట్టి నిర్మాణాన్ని వారు పరిశీలించి అనుమతులు ఇవాళ వద్దా అనేది నిర్ణయిస్తారు. ఇక్కడ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నన్ను అడిగేవారు ఎవరంటూ దౌర్జన్యపూరితంగా తన అక్రమ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని బాధితులకు పక్షాన కొంతమంది బాసటగా నిలిచి తక్షణమే బల్దియ అధికారులు  ఆ యొక్క భూమిలో నిర్మిస్తున్న అట్టి అక్రమ నిర్మాణాన్ని కూల్చాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. ఇదే విషయమై బల్దియా అధికారులను సంప్రదించగా అనుమతులు లేని నిర్మాణాలు చేపడితే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని వారు స్పష్టం చేశారు. స్థానికంగా మాకు న్యాయం జరగకుంటే కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని బాధితులు వాపోతున్నారు. ఎలాంటి క్వార్టర్  ఆలాట్ మెంట్ లాంటి లెటర్స్ లేకపోగా అన్ని  రకాల అనుమతి తో 1989 నుండి 2021 వరకు క్వార్టర్ అలాట్మెంట్ లెటర్ ఉన్న వారినే ఈ తరహా ,దిక్కున్న కాడ చెప్పుకోమని బెదిరించడం దుర్మార్గమని కాలనీవాసులు వాపోతున్నారు.