గొట్టిముక్కల ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేత

Published: Tuesday September 28, 2021
సర్వోదయ మిత్రమండలి ట్రస్ట్ వ్యవస్థాపకులు కన్నె కార్తీక్
వికారాబాద్ బ్యూరో 27 సెప్టెంబర్ ప్రజాపాలన : గొట్టిముక్కల ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను అందజేశామని సర్వోదయ మిత్రమండలి ట్రస్ట్ వ్యవస్థాపకులు కన్నె కార్తీక్ అన్నారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో గ్రామ సర్పంచ్ పట్లే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ పెరల్స్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వారి సహకారంతో సర్వోదయ మిత్రమండలి ట్రస్ట్ వారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమైనందుకు హర్షించదగిన విషయమని కొనియాడారు. ఇన్నాళ్ళు ఆన్లైన్ తరగతులతో కుస్తీపట్టిన విద్యార్థిలోకానికి ఆఫ్లైన్ తరగతులు ఊరట కలిగించే అంశమని స్పష్టం చేశారు. పుస్తకాలు వితరణ వలన పిల్లలు విద్యాభ్యాసంపై మరింత శ్రద్ధ చూపుతారని పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సర్వోదయ మిత్రమండలి ట్రస్ట్ వ్యవస్థాపకులు కన్నె కార్తీక్, కృష్ణకాంత్, చైతన్య రెడ్డి, శ్వేతా కిరణ్ మరియు రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ చతుర్వేది, రాజేందర్ లావణ్య, జయప్రకాష్ లు పాల్గొన్నారు. అనంతరం సర్వోదయ ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్ ప్రతినిధులకు ప్రధానోపాధ్యాయులు స్వప్న, భోగయ్య, గ్రామ సర్పంచ్ పట్లే వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేశారు.