ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు పెంచాలి

Published: Monday July 25, 2022
లైన్స్ క్లబ్ చైర్మన్ కౌన్సిలర్ మల్లాది వాసు*

మధిర  జులై 24 ప్రజా పాలన ప్రతినిధి  మధిర మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది మరియు పది వార్డుల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పెంచాలని లైన్స్ క్లబ్ చైర్మన్ ఆవార్డు కౌన్సిలర్ మల్లాది వాసు కోరారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని స్మైల్ ఏ గిఫ్ట్ క్రింద ఆదివారం వార్డుల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మల్లాది వాసు మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో జిల్లాలోనే మధిర తొమ్మిది మరియు పది వార్డులు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రతి ఒక్కరూ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డులో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా సంస్థలు ఈ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆయన కోరారు. ప్రభుత్వ నుండి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని మల్లాది వాసు పేర్కొన్నారు. 9 మరియు 10 వార్డుల్లో నాటిన మొక్కలను కలియక వాకర్స్ క్లబ్ చైర్మన్ ఇరుకుళ్ళ బాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కలియక వాకర్స్ క్లబ్ సభ్యులు బాధ్యత తీసుకొని మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమ్య నారాయణ టీవీ రెడ్డి డోకుపర్తి సత్యంబాబు మీసేవ శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.