ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలి

Published: Saturday December 17, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
 
మంచిర్యాల బ్యూరో,  డిసెంబర్ 16, ప్రజాపాలన :
 
విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో గల మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి పాఠశాలల్లో వంటశాల, స్టోర్ రూమ్, స్టాక్ రిజిస్టర్, విద్యార్థుల హాజరు శాతం, తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాబోధన, ఆరోగ్యం, మెన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల ప్రిన్సిపలు సూచించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ఎస్.ఎస్.సి. వార్షిక పరీక్షలకు సంబంధించి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో 10వ తరగతి పునాది లాంటిదని, వార్షిక పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఉన్నత విద్యనభ్యసించడం సులభతరమవుతుందని తెలిపారు. అన్ని సబ్జెక్టులలో కార్యచరణ పాటిస్తూ ప్రణాళికబద్దంగా సిలబస్తో రివిజన్ కూడా పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం కావాలని, వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో డి.సి.ఓ. పేరు శ్రీధర్, పాఠశాల సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.