అంతర్జాతీయ స్థాయి ఉత్తమ వానవీక్లబ్ అవార్డు తో సత్కరం..

Published: Saturday May 28, 2022
మంచిర్యాల బ్యూరో, మే 27, ప్రజాపాలన :
 
మంచిర్యాల వానవీక్లబ్ ఆధ్వర్యంలో 2020-21 సంవత్సరాలలో చేపట్టిన సేవా కార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయి మొదటి లెవల్లో ఉత్తమ వానవీక్లబ్ అవార్డును సొంతం చేసుకుంది.  నమాజ సేవా కార్యక్రమాలలో అనేక విశిష్ట సేవలను చేపడుతున్న మంచిర్యాల వానవీక్లబ్ 2020-21 రెండు సంవత్సరాలలో ముంచుకొచ్చిన కరోనా కష్టకాలంలో సైతం ధైర్యంగా సేవా కార్యక్రమాలను చేపట్టింది. రీజియన్, మహమ్మారి. జిల్లా స్థాయిలో ఉత్తమ క్లబ్ గా అవార్డును పొందిన మంచిర్యాల వావవీక్లబ్ అప్పటి అధ్యక్షుడు కాచం నతీష్, కార్యదర్శి కేశెట్టి వంశీకృష్ణ, కోశాధికారి నలుమాను ప్రవీణ్ లు అంతర్జాతీయ స్థాయి వన్ లెవల్లో కూడా ఉత్తమ వాసవీక్లబ్ అవార్డును అందుకున్నారు. అదే విధంగా అదే సంవత్సరానికి గాను వాసవివనితాక్లబ్ పాటు ఉత్తమ వికెఎస్పి ఇంచార్జిగా అప్పాల శ్రీధర్, ఉత్తమ క్యాబినెట్ కోశాధికారిగా కొండా చంద్రశేఖర్లు కూడా అంతర్జాతీయ స్థాయి వన్ లెవల్లో అవార్డులను సాధించారు.