ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 19ప్రజాపాలన ప్రతినిధి *బరితెగిస్తున్న భూ కబ్జాదారులు*

Published: Tuesday December 20, 2022

ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు పురుషోత్తం రెడ్డి  ఐదు ఎకరాల భూమిని తన అమ్మమ్మ కొడుకు మామగారైన రాజేందర్ రెడ్డి వద్ద 2006వ సంవత్సరంలో 5 ఎకరాల 9 గుంటల భూమి మాల్ నుండి మర్రిగూడ వెళ్లే  దారిలో కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు రాజిరెడ్డి అనే పేరుతో భూమికి  ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మూడు ఎకరాల 9 గుంటల భూమి కబ్జా చేసే ప్రయత్నాలలో స్థానిక రాజకీయ నేతలు వెనుక ఉండి, మనోహర్ రెడ్డి, జంగారెడ్డి, కొండల్ రెడ్డిలను ముందు ఉంచి భూ కబ్జా బాగోతాన్ని నడిపిస్తున్నారని బొడ్డు పురుషోత్తం రెడ్డి ఆరోపిస్తున్నారు. లేని రాజిరెడ్డి పేరుతో సృష్టించిన ఫేక్ భూపత్రాలపై సమగ్ర విచారణ జరిపించి, నకిలీ పత్రాలతో సీలింగ్, ప్రైవేటు భూముల కబ్జాకు యత్నిస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని పురుషోత్తం రెడ్డి తన వ్యవసాయ పొలంలో పత్రికా సమావేశం లో కోరారు. రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి ఇబ్రహీంపట్నం కు చెందిన పొల్ జంగారెడ్డి, తక్కల్లపల్లి గ్రామానికి చెందిన మారేడుపల్లి కొండల్ రెడ్డి అనే వ్యక్తులకు విక్రయించాడని బొడ్డు పురుషోత్తం రెడ్డి తెలిపారు. అయితే సర్వే నెంబరు 565 లోని మొత్తం భూమి 1975 నుంచి మొదలుకొని 1995 వరకు సీలింగ్ లో ఉందని అన్నారు . సీలింగ్ లో ఉన్న భూమిని రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి  లేని బట్ట రాజిరెడ్డి వద్ద ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. అయితే సీలింగులో ఉన్న భూములన్నీ బట్ట రాజేందర్ రెడ్డి పేరిట ఉండగా, రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి మాత్రం తాను బట్ట రాజిరెడ్డి వద్ద కొనుగోలు చేసినట్లు ఫోర్జరీ పత్రాలను సృష్టించారని తెలిపారు. అసలు ఈ బట్ట రాజిరెడ్డి ఎవరో, ఆయనకు తన మేనమామ అయిన రాజేందర్ రెడ్డి కి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. ఆ పత్రాలపై ఉన్న సంతకాలు కూడా తమ మేనమామ అయిన బట్ట రాజేందర్ రెడ్డివి కావని తెలియజేశారు. ఫోర్జరీ పత్రాలను సృష్టించి తమ భూమిని కాజేయాలని చూస్తున్న రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి, పొల్  జంగారెడ్డి, మారేడుపల్లి కొండల్ రెడ్డిలు ఒక ముఠాగా ఏర్పడి నన్ను చంపేసామని బెదిరిస్తున్నారని, మొత్తం ఐదు ఎకరాల తొమ్మిది గంటలు వదిలి వెళ్లాలని మా నాన్నను వాచ్ మెన్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారని తెలిపారు. జంగారెడ్డి, కొండల్ రెడ్డిలపై నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదు చేశారని, రెడ్డి రెడ్డి మనోహర్ రెడ్డి పై కేసు నమోదు చేయకుండా పోలీసులు కూడా కాల వ్యాపన చేశారని తెలిపారు. తమ భూమిని కబ్జా చేయడానికి ఈ ముగ్గురు బృందం ముఠా స్థానిక రాజకీయ నేతలను కూడా కలుపుకొని కుట్ర చేస్తున్నారని బొడ్డు పురుషోత్తం రెడ్డి తెలిపారు.  దయచేసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి  రెవెన్యూ అధికారులకు నా మనవి ఏమనగా నా యొక్క భూమి దస్తావేజులు పరిశీలించి మాకు తగిన న్యాయం చేస్తారని బొడ్డు పురుషోత్తం రెడ్డి పత్రికా సమావేశంలో తెలిపారు.