ఆరోగ్యమే మహాభాగ్యం మద్యపానా నీ కి దూరంగా ఉండాలి డాక్టర్ వెంకటేష్ మధిర

Published: Wednesday August 24, 2022
రూరల్ఆగస్టు 23 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఖమ్మం ఆదేశాల ప్రకారం గుట్కా, కైని, మద్యపానానికి దూరంగా ఉండవలెను ఆదేశం మేరకు  సిరిపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎండవల్లి గుట్టలు నందు  ఒరిస్సా కూలీలు నివసిస్తున్న ఏరియాలో మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్  ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరం నందు అక్కడ నివసిస్తున్న కుటుంబాల వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం జరిగినది. కొత్తగా ముగ్గురికి బీపీ ,షుగర్ వ్యాధులను గుర్తించి వారికి తగిన వైద్యం అందించటం జరిగినది.. మిగిలిన వారందరికీ విటమిన్ టాబ్లెట్లు బి కాంప్లెక్స్ ఐరన్ టాబ్లెట్లు ఇవ్వటం జరిగింది. అక్కడ వారు తాగుతున్న  నీటిని పరీక్షల నిమిత్తం మిషన్ భగీరథ వారికి పంపించడం జరిగినది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జానీ చందు ను పరామర్శించి వెంటనే ఖమ్మం ప్రభుత్వ హాస్పటల్ కి పంపనైనది.. ఈ సందర్భంగా వైద్యాధికారి  అక్కడి ప్రజలతో మాట్లాడుతూ వారు జీవనశైలిని గురించి తెలుసుకొని, మద్యపానం , గుట్కాలకు దూరంగా ఉండాలని ఇతర ఆరోగ్య సలహాలు ఇవ్వటం జరిగింది... అక్కడి అంగన్వాడి సెంటర్ నందు నమోదైన పిల్లల ఆరోగ్యము వారికి ఇస్తున్న పోషక ఆహారంపై అంగన్వాడీ టీచర్ ను అడిగితెలుసుకోవడం జరిగిందిఈ వైద్య శిబిరంలో మధిర మండల డెవలప్మెంట్ అధికారి  విజయభాస్కర్ రెడ్డి , ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు భాస్కరరావు, సుభాషిని, డిఇఓ కిరణ్ కుమార్, క్వారీ నిర్వాహకులు పాటిబండ్ల సత్యం బాబు   మహిళా ఆరోగ్య కార్యకర్తలు సుజాత, ఝాన్సీ ,ఆశా కార్యకర్త కుసుమ, అంగన్వాడీ టీచర్ మమత పాల్గొన్నారు....