నిరు పేదలకు అన్యాయం జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు..

Published: Thursday December 16, 2021
పాలేరు డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండలం రాజేశ్వర పురం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో ఎంతమంది అర్హతలు ఉంటే దానిలో 35 మందిని సెలక్షన్ చేసి మళ్లీ ఉన్న 19 డబుల్ బెడ్రూ గాను ఈ ముప్పై ఐదు మంది ని డ్రా చేయడం జరిగింది కానీ 35 మందిలో 19 మందికి మాత్రమే ఇల్లు లభించాయి మిగతా 16 మందికి కి మాత్రం విల్లు లభించలేదు ఈ సందర్భంగా నిరుపేద కుటుంబం మునిగంటి వీరబాబు అనే వ్యక్తి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇల్లు వస్తది అని ఎదురు చూస్తూ జీవనం గడుపుతున్నాడు తీరా ఈరోజు డిసెంబర్ 15వ తారీఖు నాడు ప్రభుత్వ అధికారులు లాటరీ ద్వారా రా తీయగా డబల్ బెడ్రూమ్ రాలేదని మనస్థాపానికి గురై పురుగుల మందు త్రాగటం జరిగింది ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వటంలో ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న పదివేల మంది నివసించే మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 8 సంవత్సరాలకు 16 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించడం ఎంతవరకు న్యాయం అని కావున ఇది మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అర్హత ఉన్న ప్రతి ఒక నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూం కట్టించి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి గ్రామం నుండి ఈ ప్రభుత్వం పై  నిరుపేద కుటుంబాల కు న్యాయం జరిగే వరకు పోరాడుతామని గ్రామాలలో వేలాది మంది నిరుపేద కుటుంబాలు ఉంటే ఊరికే ఒక పది పదిహేను డబుల్ బెడ్ రూమ్ లో మాత్రమే ఇస్తే మిగతా కుటుంబాలు పరిస్థితి ఏంటని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చేవరకూ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతామని అలాగే పురుగుల మందు తాగిన మునిగంటి వీరబాబు కి మరి మెరుగైన వైద్యం అందించాలని అలాగే ప్రభుత్వం తరఫున వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని అలాగే ఆ కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళం కన్వీనర్ బచ్చల కూరి నాగరాజు పాలేరు నియోజకవర్గ బీసీసెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెర్రిపోతుల సత్యనారాయణ జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని నేలకొండపల్లి మండలం నల్లగొండ బద్రి తదితరులు పాల్గొన్నారు