బీసీ భవన్ కు ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించాలి ** బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ **

Published: Monday September 26, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 24 (ప్రజాపాలన, ప్రతినిధి) : 
 
 జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం భవనానికి ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించి, భవన నిర్మాణానికి కృషి చేయాలని  బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రూప్నర్ రమేష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బీసీ భవనానికి స్థలం కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు, అధికారులకు కనికరం  లేదన్నారు. జిల్లా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ బీసీ భవన్ కోసం స్థలం కేటాయింపుపై ఉలుకూ పలుకూ లేదన్నారు. బీసీలపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎప్పటికీ ఉండే విధంగా ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
 రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి పటేల్ మాట్లాడుతూ జిల్లాలోని ఫర్టిలైజర్ షాపుల్లో పెద్ద ఎత్తున  అధికారులు స్పందించి అలాంటి షాపులను సీజ్ చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు ప్రశాంత్, ప్రణయ్, ప్రణీత్, లు పాల్గొన్నారు.