నాలుగు ఎమ్మెల్సీలు బీసీలకు కేటాయించాలి

Published: Thursday November 11, 2021
పట్టణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 10, ప్రజాపాలన నాలుగు ఎమ్మెల్సీలు బీసీలకు కేటాయించాలని తెలంగాణ బిసి జాగృతి పట్టణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బుధవారం  మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ బీసీ జాగృతి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కోటా నుండి 6, గవర్నర్ కోటా నుంచి 1 భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ లో నాలుగు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్  హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన విధంగా వడ్డెర, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, లింగబలిజ, తదితర 90 కులాలకు చట్టసభల్లో ఇప్పటివరకు వీరికి అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం కల్పించే విధంగా రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు అవకాశం కల్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు మేంత్యాల సంతోష్, వైద్య భాస్కర్, యువ జాగృతి నాయకులు మంచ్చర్ల సదానందం, నాయకులు గుమ్ముల సుదర్శన్, బి పోచం తదితరులు పాల్గొన్నారు.