శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Published: Saturday June 26, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం సంబంధించిన అనుబంధ దేవాలయం వెంకటాపురం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవ కార్యక్రమంలో శుక్రవారం రోజున హోమం బలిహరణం పూర్ణాహుతి చక్ర తీర్థం ధ్వజ పట ఉద్వాసన మూగ బలి దేవతోద్వాసన శ్రీ పుష్ప యాగం ఏకాంత సేవలు కార్యక్రమం యాజ్ఞ్యచార్య ప్రతాపురం మత్స్యగిరి స్వామి అర్చక బృందంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె.రవి కుమార్, ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ధర్మకర్తలు, గ్రామ సర్పంచ్ కొత్త నరసింహ, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.