ప్రధాన ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి --ఎమ్మేల్యే డా.సంజయ్

Published: Thursday September 29, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణములో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని  ఎమ్మేల్యే డా.సంజయ్ సందర్శించినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో డయాలసిస్ రూం నీ పరిశీలించగా రూం లో ఏసి లు పనిచేయక పోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు, అనంతరం సిటీ స్కాన్ రూం ను, అప్తమాలజి రూం లను పరిశీలించారు. పట్టణం లో మాతా శిశువుల కోసం మరియు జనరల్ ఆసుపత్రి ఏర్పాటు ద్వారా ప్రజలకు, రోగులకు చాలా సౌలభ్యం ఏర్పడ్డది అని అన్నారు. ఆసుపత్రిలో  కంటి వైద్యులు 4 గురు ఉన్నారు అని శస్త్ర చికిత్సలు మాత్రం చేయటం లేదని చికిత్సలు కుడా చేయాలని, ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, అవసరమైన సదుపాయాల సంబంధిత వైద్యులు పరిశీలించి తన దృష్టి కి తీసుకురావాలని, ఏర్పాటుకు కృషి చేస్తానని, కొన్ని పరికరాలు వృధాగా ఉండడం వల్ల పనికిరాకుండా పోయాయని అన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి పైన కంటి వైద్యానికి రూం మరమ్మత్తు నిమిత్తం ఎమ్మేల్యే నిధుల నుండి నిదులు కేటాయిస్తానని అన్నారు. ఎమ్మేల్యే వెంట సుపెరిండెంట్ డా. రాములు, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టుసతీష్, నాయకులు పరశురామ్ గౌడ్, భోగ ప్రవీణ్, దాసరిప్రవీణ్, రామ్మోహన్ రావు, ఎఈ రాజ మల్లయ్య, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.