కళాకారుల పెన్షన్ పెంపు పట్ల హర్షం

Published: Saturday May 29, 2021

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన  పుతుంబాక కృష్ణ ప్రసాద్
మధిర, మే 28, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వృద్ధ కళాకారుల పెన్షన్ 1500 నుండి 3016 పెంపొందించి వృద్ధ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఇటువంటి గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంస్కృతిక సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి గారికి సంస్కృతిక శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బీ శివ కుమార్ గారికి, శ్రీ రామచంద్ర రావు గారికి శ్రీ పుతుంభకా కృష్ణ ప్రసాద్ గారికి.మధిర మండల రంగస్థల కళాకారులు కృతజ్ఞతలు తెలిపారురంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్ కృషితోనే మధిర కళాకారుల పెన్షన్ లు మంజూరయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో రంగస్థల కళాకారులు ప్రత్యేక పాత్ర ఉందని, పేద కళాకారులు కెసిఆర్  పెద్దన్న పాత్ర వహిస్తారని, అర్హులైన ప్రతి ఒక్క రంగస్థల కళాకారులుకి పెన్షన్ అందేలా చూస్తామని, రంగస్థల కళాకారులు పెన్షన్ పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ కి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పెన్షన్ మంజూరుకి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ప్రత్యేక కృషితో మధిర కళాకారుల పెన్షన్ మంజూరైనట్లు ఆయన తెలిపారు