టిఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ: బిజెపి మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు

Published: Friday May 20, 2022
మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ మరియు యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన
 
 
బోనకల్ ,మే 19 ప్రజా పాలన ప్రతినిధి: జిల్లా బిజెపి నాయకులు మంత్రి అజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నంలో ఖమ్మం పోలీసులు అడ్డుకుకొని బిజెపి నాయకుల పట్ల పోలీసుల వైఖరి పై భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అనంత్ ఉపేందర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు. అక్కడ ఉన్న బీజేపీ నాయకులు స్పందించి కాపాడి హాస్పిటల్ లో చేర్పించారు. బీజేపీ నాయకులు కార్యకర్తల పట్ల తెలంగాణ పోలీసులు వ్యవరిస్తున్న తీరు ను ఖండిస్తూ మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు విరపనేని అప్పారావు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ నాయకుల కనుసన్నలలోపోలీసు వ్యవస్థ నడుస్తోందని పోలీసుల తీరును తప్పుబట్టారు. ఖమ్మం పోలీసులు ఏకపక్ష ధోరణి మానుకొని సామాన్య ప్రజలకు ప్రజా పోలీసులుగా వ్యవహరించాలని అన్నారు.యువమోర్చా మండల అధ్యక్షుడు కాలసాని పరశురామ్ మాట్లాడుతూ మొన్న జరిగిన బండి సంజయ్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూన్నారని, నిన్న బీజేపీ ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమం అడ్డుకోవడమే కాకుండా అధ్యక్షులు అనంత ఉపేందర్ గౌడ్ అన్న మీద దురుసుగా ప్రవర్తించిన పోలీసులు తీరుకు నిరసనగా ఒంటిమీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యారు. ఇప్పటికే పోలీసులు తీరు వల్ల గత నెలలో బిజెపి కార్యకర్త సాయి గణేష్ ని పోగొట్టుకున్నామని, ఈ పోలీసులు వల్లే ఉపేంద్ర అన్న ని వదిలి పెట్టుకోలేమని, మంత్రి ఆదేశాలతో పోలీసులు వల్ల ఇంకెన్ని అఘాయిత్యాలు జరుగుతాయో అని సామాన్య ప్రజలు భయపడుతున్నారు. వీళ్లు తెలంగాణ పోలీసులా లేక తెరాస పోలీసులా అనే భావన ప్రజల్లో కలుగుతుందని, తెలంగాణలో రాబోయే ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమే కెసిఆర్ నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడానికి బీజేపీ పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాఢ్యక్షుడు గుగులోతు నాగేస్వరావు, మండల కార్యదర్శి గంగుల నాగయ్య, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు తాళ్లూరి సురేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవి, యువనేత బీపీ నాయక్, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు భూక్యా సైదా తదితరులు పాల్గొన్నారు.