పెండింగ్ ఆక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి

Published: Tuesday August 23, 2022

మంచిర్యాల టౌన్, ఆగష్టు 22, ప్రజాపాలన : పెండింగ్ ఆక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సముదాయంలో పౌర సంబంధాల శాఖ అధికారి సంపత్ కుమార్ కు మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 2022-24 కు గాను జర్నలిస్టుల ఆక్రిడిటేషన్ గుర్తింపు కార్డుల జారీ కి నోటిఫికేషన్ విడుదల చేసిన తరుణంలో జిల్లాలోని వివిధ పత్రికల్లో పని చేస్తున్న  అనేక మంది జర్నలిస్ట్లు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఇందులో జిల్లాలో కొన్ని పత్రికలకు, కొద్ది మంది పాత్రికేయులకు కార్డులు మంజూరు కాలేదని పెండింగ్ లో ఉన్న కార్డులు మంజూరుకు జిల్లా ఆక్రిడిటేషన్ కమిటీ కన్వీనర్ గా సహకరించి అందరి సమన్వయంతో కార్డులు జారీ అయ్యే విధంగా చూడాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని, దశాబ్దాల కాలంగా అనేక మంది విలేకరులు వివిధ పత్రికల్లో పనిచేస్తూ వార్త కథనాలు అందిస్తున్నారని, కార్డుల మంజూరు తో ప్రభుత్వం అందించే రాయితీలను అర్హులు అవుతారు అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న విలేకరులకు  కార్డులు అందించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు రూపురెడ్డి ప్రకాష్ రెడ్డి, చొక్కరపు శ్రీనివాస్, రమేష్ రెడ్డి, సురేష్ చౌదరి, పార్వతి సురేష్, నేరెళ్ళ రమేష్, నలివేటి మహేష్, కేదరి నాథ్ , మాసూ రాకేష్, కడారి శ్రీధర్, రంగ సాగర్, కొల్లూరి తిరుపతి, డేగ అంజి, గౌతం, సుభాష్, గట్టయ్య, గోపి కృష్ణ, సురేందర్, సల్ల నరేష్, ఓదెలు,తిరుపతి, అమర్నాథ్ రెడ్డి, బండి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.