తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Wednesday February 01, 2023

 

జన్నారం, జనవరి 31, ప్రజాపాలన:  మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో  తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య ఆదేశాల మేరకు మండలంలోని, కామన్ పల్లిలో  ఆవిర్భవ దినోత్సవ వేడకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా  మండల అధ్యక్షులు పాలాజీ శ్రీనివాస్ సంఘం జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకులు ,మండల నాయకులు  తెలంగాణ తల్లి విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి గల్ఫ్ సమస్యలపై మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా  నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు 9 సంవత్సరాలు గడిచిన గల్ఫ్ కార్మికులకు చేసిందమిలేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో భాగంగా  ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గల్ఫ్ కార్మికులను ఊదేశించి మాట్లాడుతు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలసలు వెల్లిన రాష్ట్ర కార్మికులను వెనక్కి తెప్పించుకుని, రాష్ట్రంలోనే వారికి ఉపాధిని కలిపిస్తామన్నారు. ఇతర రాష్ట్రాలు చేసిన గల్ఫ్ కార్మికుల కోసం కేరళ తరహా రూ|| 500 కోట్లు కేటాయించి సంక్షేమ బోర్డ్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చి 9 సంవత్సరములు గడిచిన ముఖ్యమంత్రి  గల్ఫ్ కార్మికుల సమస్యలను పట్టించు కోవడం లేదన్నారు గతంలో తెలంగాణ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేక పోయన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన గల్ఫ్ కార్మికులు 15 లక్షల మంది ఉన్నారు. వారినుండి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే సంవత్సరపు ఆదాయం పది వెల కోట్లు రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో మాభాగస్వామ్యం కూడా ఉందని మర్చిపోగా గల్ఫ్ కార్మికులు అంటే చిన్నచూపు చూస్తురన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల డిమాండ్లను ను కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు.  రాబోయే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో “గల్ఫ్ సంక్షేమ బోర్డు" ప్రవేశ పెట్టాలని డిమాండ్  చేశారు. 

ఈ కార్యక్రమంలో రాంపూర్, తిమ్మాపూర్, రోటిగూడ, మహ్మదాబాద్, చింతగూడ, పోన్కల్ జన్నారం, బాదంపెళ్లి, చింతలపల్లి, ధర్మారం, మురిమడుగు, కిష్టాపూర్,  కామన్ పెళ్లి, కవ్వాల్, దేవునిగూడెం, ఇందన్ పెళ్లి గల్ఫ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారుజన్నారం, జనవరి 31, ప్రజాపాలన:  మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో  తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య ఆదేశాల మేరకు మండలంలోని, కామన్ పల్లిలో  ఆవిర్భవ దినోత్సవ వేడకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా  మండల అధ్యక్షులు పాలాజీ శ్రీనివాస్ సంఘం జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకులు ,మండల నాయకులు  తెలంగాణ తల్లి విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి గల్ఫ్ సమస్యలపై మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా  నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు 9 సంవత్సరాలు గడిచిన గల్ఫ్ కార్మికులకు చేసిందమిలేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో భాగంగా  ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గల్ఫ్ కార్మికులను ఊదేశించి మాట్లాడుతు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలసలు వెల్లిన రాష్ట్ర కార్మికులను వెనక్కి తెప్పించుకుని, రాష్ట్రంలోనే వారికి ఉపాధిని కలిపిస్తామన్నారు. ఇతర రాష్ట్రాలు చేసిన గల్ఫ్ కార్మికుల కోసం కేరళ తరహా రూ|| 500 కోట్లు కేటాయించి సంక్షేమ బోర్డ్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చి 9 సంవత్సరములు గడిచిన ముఖ్యమంత్రి  గల్ఫ్ కార్మికుల సమస్యలను పట్టించు కోవడం లేదన్నారు గతంలో తెలంగాణ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేక పోయన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన గల్ఫ్ కార్మికులు 15 లక్షల మంది ఉన్నారు. వారినుండి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే సంవత్సరపు ఆదాయం పది వెల కోట్లు రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో మాభాగస్వామ్యం కూడా ఉందని మర్చిపోగా గల్ఫ్ కార్మికులు అంటే చిన్నచూపు చూస్తురన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల డిమాండ్లను ను కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు.  రాబోయే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో “గల్ఫ్ సంక్షేమ బోర్డు" ప్రవేశ పెట్టాలని డిమాండ్  చేశారు.